మళయాళీ ముద్దుగుమ్మ నిత్యా మీనన్(Nithya Menen) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కథా బలమున్న చిత్రాల్లో నటిస్తూ.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చివరగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘భీమ్లానాయక్’లో నటించింది ఈ బొద్దుగుమ్మ. అలాగే ఇటీవల ధనుష్ నటించిన ‘తిరు’ అనే డబ్బింగ్ చిత్రంతో తెలుగు ఆడియెన్స్‌ను పలకరించింది.
ప్రస్తుతం మళయాళం, తమిళ్లో సినిమాలు చేస్తున్న నిత్య.. తెలుగుతో పాటు హిందీలోను కొన్ని వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. అయితే ఆ మధ్య నిత్య ఎఫైర్ గురించి జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు ఓ మలయాళ హీరోను పెళ్లి చేసుకోబోతుందని కూడా వినిపించింది. ఇక ఇప్పుడు ఏకంగా నిత్య ప్రెగ్నెంట్ అయిందంటూ ఓ పోస్ట్ చేసింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ వచ్చిన కిట్‌కు సంబంధించిన ఫొటోను ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు అభిమానులు. అమ్మడు పెళ్లి కాకుండానే తల్లి అయిందా.. అనేది అంతుబట్టకుండా పోయింది. దీనిపై రకారకాలుగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రెగ్నెన్సీ నిజమే అయితే.. తండ్రి ఎవరు అని కామెంట్ చేస్తున్నారు. అయితే నిత్య ప్రెగ్నెన్సీ పోస్ట్.. ఓ సినిమా కోసం అని తెలిసింది. తన అప్ కమింగ్ ఫిల్మ్ ప్రచారం కోసమే నిత్య ఇలా చేసింది. ‘వండర్ వుమెన్’ అనే మళయాళ సినిమాలో మరో హీరోయిన్ పార్వతీ తిరువొతుతో కలిసి నటిస్తోంది నిత్య. అందుకే ఈ మూవీలో ఈ ఇద్దరు ప్రెగ్నెంట్ లేడిగా కనిపించబోతున్నారు. అందుకే ఇలా తప్పుదోవ పట్టించారు.