Food Packaging Industry: వేగవంతమైన పట్టణీకరణ, మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయుల ఆహారపు అలవాట్లలో మార్పు వచ్చింది. ఆ కారణంగా భారతీయ ఆహార, పానీయాల ప్యాకేజింగ్ పరిశ్రమ 2029 నాటికి 86 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్స్ అసోసియేషన్ ఇటీవల తెలిపింది. ఈ పరిశ్రమ సంవత్సరానికి 14.8 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. కోవిడ్ -19 తర్వాత సహజ ఆహార పదార్థాలకు డిమాండ్ పెరిగింది. న్యూట్రాస్యూటికల్స్ , ఆర్గానిక్ ఆహారాలు FSSAI కొత్త నియమాలు ఈ రంగంలో అభివృద్ధికి ఊతం ఇస్తున్నాయి. ఆగస్ట్ 17-19 వరకు భారతదేశంలో ఇన్ఫార్మా మార్కెట్స్ నిర్వహించిన ఫుడ్ ఇన్‌గ్రేడియంట్స్ (ఫై ఇండియా), ప్రోప్యాక్ ఇండియా వ్యవస్థీకృత ప్యాకేజ్డ్ పదార్థాల మార్కెట్ ఏటా రూ. 20,000 కోట్ల విలువైనదని, లూజ్ నుండి ప్యాకేజ్‌కు మారుతుందని చెప్పారు.
భారతీయ ఆహార & పానీయాల ప్యాకేజింగ్ పరిశ్రమ విలువ 2022లో 32 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2029 నాటికి 86 బిలియన్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రబోధ్ హల్డే చెప్పారు. ప్లాస్టిక్ రహిత, మోనో-ప్యాకేజింగ్ మెటీరియల్‌ల వైపు మళ్లడం పరిశ్రమల అంకితభావాన్ని చూపుతుంది. ఈ రంగం 2024 నాటికి 9 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించగలదని.. 2030 నాటికి భారతదేశ వార్షిక గృహ వినియోగం నాలుగు రెట్లు పెరుగుతుందని ఆయన అన్నారు. ప్రపంచంలో ఇది ఐదవ అతిపెద్ద వినియోగదారు. వినియోగదారుల మారుతున్న ప్రాధాన్యతలను తీర్చడానికి పరిశ్రమ వినూత్న ఉత్పత్తులను రూపొందించడంపై దృష్టి పెట్టాలని ప్రబోధ్ హల్డే సూచించారు. ముఖ్యంగా సేంద్రీయ, ఆరోగ్య ఆహార రంగాలలో కొత్త ఉత్పత్తులను తీసుకురావాలన్నారు. ఈ రంగం పరిమాణం 322 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది.. 2025 నాటికి 543 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేయబడింది.