»Rat In Chutney In Jntu Minister Damodara Rajanarsimha Who Was Fired
Damodara Rajanarsimha: జేఎన్టీయూలో చట్నీలో ఎలుక.. ఫైర్ అయిన మంత్రి దామోదర రాజనర్సింహ
జేఎన్టీయూలో క్యాంటీన్లో చట్నీలో ఎలుక పడిన సంఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ కలెక్టర్‌ను క్యాంపస్‌కు పంపించి తనిఖీ చేయించారు. దానిపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇక ఎలుక పడిన వీడియో నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే.
Rat in chutney in JNTU.. Minister Damodara Rajanarsimha who was fired
Damodara Rajanarsimha: సంగారెడ్డి జిల్లాలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో చట్నీలో ఎలుక పడిన సంఘటనపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. సంబంధిత అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని చౌటకూరు మండలం సుల్తాన్‌పూర్‌లో ఉన్న కాలేజీ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియోలో తెగ వైరల్ అయింది. దీనిపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్, ఆర్డీవో, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లు, క్యాంటీన్లలో తనిఖీలు చేయాలని పేర్కొన్నారు.
ఏ సంస్థ అయినా సరే ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. కాలేజీలలో, హాస్టళ్లలో ఆహారం తయారు చేసే కాంట్రాక్టర్లు కచ్చితంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. అంతే కాదు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిత్యం హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్లు, ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకులపై నిఘా ఉంచాలని, వినియోగదారులకు తాజా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక మంత్రి ఆదేశాలు అందుకున్న సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి జేఎన్టీయూ క్యాంపస్‌ను సందర్శిచారు. హస్టళ్లోని వంట గదిని పరిశీలించారు. వంటగది అపరిశుభ్రంగా ఉందని కాలేసీ ప్రిన్సిపల్, సిబ్బంది, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను రోజువారి ఆహార పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భోజనంలో అపుడప్పుడు పురుగులు, బొద్దింకలు వస్తాయన్న విద్యార్థుల మాటలను సిరీయస్‌గా తీసుకున్న అదనపు కలెక్టర్ మాధురి వెంటనే మెస్ కాంట్రాక్టర్‌ను మార్చాలని ఆదేశించారు.