»4 Month Old Baby In Jagityala District Of Telangana Has Achieved A Guinness Record
Guinness record: వారెవ్వా..4 నెలల పాప గిన్నీసు రికార్డు
పాలు తాగాల్సిన వయస్సులో ప్రపంచ రికార్డు సృష్టించింది ఓ చిన్నారి. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ నాలుగు నెలల పాప చేసిన అరుదైన ఫీట్‌కు గిన్నీస్ రికార్డులో చోటు సాధించుకుంది. తన స్పెషల్ ట్యాలెంట్ ఏంటో చూద్దామా..
4-month-old baby in Jagityala district of Telangana has achieved a Guinness record
Guinness record: నాలుగు నెలల పాప ఈ వయసులో ఏం చేస్తుంది. మహా అయితే తల్లి ఒడిలో సేద తీరుతూ పాలు తాగుతు ఉంటుంది. ఆకలిని కూడా తల్లితో చెప్పాలేదు బదులుగా ఏడుస్తూ ఉంటుంది. అర్థం చేసుకోవడం తల్లి వంతు. అయితే ఓ చిన్నారి మాత్రం నాలుగు నెలల వయస్సులోనే అద్భుతమైన ప్రతిభను చూపుతుంది. ఆ పాప పేరు ఐరా. ఆ వయస్సులోనే చిన్నారి తన ప్రతిభతో నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. చిన్నారి జ్ఞాపక శక్తి చూస్తే అవాక్కు అవాల్సిందే. తల్లి శిక్షణలో అన్న ప్రాసనకు ముందే అన్నింటిని గుర్తు పెట్టేస్తోంది. వివిధ రకాల బొమ్మలను ఆమెకు చూపిస్తూ అడిగుతున్న క్రమంలో ఐరా తల్లి అడిగిన బొమ్మను పట్టేసుకుంటోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిసేటి మహేందర్, మౌనిక దంపతుల పుత్రిక ఐరా. ఆ చిన్నారిలో ఉన్న ప్రతిభను మూడునెలల వయసులోనే తల్లి గుర్తించింది. అప్పటి నుంచి తన కూతురుకు వివిధ రకాల బొమ్మలను చూపిస్తూ వాటి గురించి చెప్పడం ప్రారంభించింది. దాంతో నాలుగు నెలల వయసులోనే 135 ఫ్లాష్ ఐడెంటిటీ కార్డులను గుర్తు పట్టగలగుతోంది ఈ చిన్నారు. ఇదే విషయాన్ని నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆ సంస్థ ప్రతినిధులు ఐరాలోని ప్రతిభను గుర్తించారు. ఈ మేరకు పాప పేరును నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేయడంతో పాటు సర్టిఫికెట్, మెడల్ ఇచ్చారు. ఐరా ముఖ్యంగా కూరగాయలు, వెజిటేబుల్స్, బర్డ్స్, యానిమల్స్, ఫ్లాగ్స్, కంట్రీస్ వంటి వాటిని గుర్తించగలదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం నెట్టింట్లో వైరల్ అవుతుంది.