Rat in Bread Packet : బ్రెడ్ ప్యాకెట్ ఆర్డర్ చేస్తే ఎలుక వచ్చింది.. ఖంగుతిన్న కస్టమర్.. ఆ తర్వాత ఏమైందంటే?
పార్టనర్ స్టోర్ ను వెంటనే తమ సర్వీస్ నుంచి డీ లిస్ట్ చేశామని, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని ఆ కస్టమర్ కు బదులిచ్చారు బ్లింకిట్ యాప్ నిర్వాహకులు. ఇక.. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Rat in Bread Packet : ఇప్పుడంతా ఇన్ స్టంట్ కి అలవాటు పడ్డాం మనం. ఏదైనా వెంటనే జరిగిపోవాల్సిందే. మనం ఇలా అనుకుంటే.. అలా సరుకులు కూడా ఇంటికి రావాలి. మన బద్ధకాన్ని క్యాష్ చేసుకోవడానికి వందల్లో ఆన్ లైన్ గ్రాసరీ, షాపింగ్ యాప్స్ పుట్టుకొచ్చాయి. 10 నిమిషాల్లో మీ ఇంటి ముందు సరుకులు ఉంటాయి అనే నినాదంతో చాలా గ్రాసరీ యాప్స్ వచ్చాయి. అందులో ఒకటి బ్లింకిట్. ఈ యాప్ ద్వారా కావాల్సిన సరుకులకు ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో సరుకులు ఇంటికి వస్తాయి.
ఇటీవల ఓ కస్టమర్.. బ్లింకిట్ యాప్ ద్వారా బ్రెడ్ ప్యాకెట్ బుక్ చేశాడు. దీంతో అతడికి బ్రెడ్ ప్యాకెట్ లో దాక్కొని ఉన్న ఎలుక కనిపించింది. అది బతికే ఉంది. దాన్ని చూసి కెవ్వుమంటూ కేక వేశాడు. ఈ ఘటన ఫిబ్రవరి 1న చోటు చేసుకుంది. నితిన్ అరోరా అనే వ్యక్తికే ఇది జరిగింది. చూడండి.. నేను బ్రెడ్ ప్యాకెట్ ఆర్డర్ చేస్తే నాకు బతికి ఉన్న ఎలుకను కూడా డెలివరీ చేశారు. 10 నిమిషాల్లో డెలివరీ చేస్తామంటూ ప్రామీస్ చేసే వీళ్లు ఇలాంటి ఐటెమ్స్ డెలివరీ చేస్తారా? ఇలా అయితే కొన్ని గంటలు వెయిట్ చేసి అయినా మంచి సరుకులు తెచ్చుకోవడం మేలు అంటూ బ్లింకిట్ కు లింక్ చేస్తూ ట్వీట్ చేశాడు నితిన్ అరోరా.
Rat in Bread Packet : వెంటనే స్పందించిన బ్లింకిట్ యాప్
దీనిపై బ్లింకిట్ యాప్ వెంటనే స్పందించింది. పార్టనర్ స్టోర్ ను వెంటనే తమ సర్వీస్ నుంచి డీ లిస్ట్ చేశామని, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని ఆ కస్టమర్ కు బదులిచ్చారు బ్లింకిట్ యాప్ నిర్వాహకులు. ఇక.. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బ్లింకిట్ యాప్ లో ఇలాంటివి కామన్. నేను చాలాసార్లు ఇటువంటి ఘటనలపై ఫిర్యాదు చేశా. చివరకు యాప్ లో కస్టమర్ సపోర్ట్ నే బ్లాక్ చేశారు.. అంటూ ఓ నెటిజన్ తనకు జరిగిన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. వామ్మో.. నాకే కనుక ఇలా ఎలుక వస్తే వెంటనే పోలీసులకు కాల్ చేసేవాడిని. ఎలుకలు చాలా డేంజర్ భయ్యా.. అంటూ మరో వ్యక్తి రిప్లయి ఇచ్చాడు.