TG: బీసీ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్యను హైదరాబాద్లోని ఆయన నివాసంలో గ్రూప్-2 అభ్యర్థులు కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రం అందించారు. దీనిపై స్పందించిన ఆయన గ్రూప్-2లో 3వేల ఖాళీలు ఉన్నాయన్నారు. 45 పోస్టులు ఇవ్వడం పెద్ద సమస్య కాదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు.