SRD: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు మంగళవారం అయ్యప్ప స్వామి భక్తులు కలిశారు. ఈ నెల 30న జరగనున్న రాము గురు స్వామి నారికేళ మహా పడిపూజ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు అందజేశారు. కార్యక్రమంలో గురు స్వాములు శ్రీశైలం గౌడ్, పరమేశ్వర్ గౌడ్, విశ్వనాథరావు, సత్యనారాయణ, నాయుడు, సదాశివపేట మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ చింతా గోపాల్ తదితరులు ఉన్నారు.