ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని మొగళ్లూరు గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు. ఎంపీడీవో గంగాధర్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి కొండయ్య పారిశుద్ధ్య కార్మికులతో సైడ్ కాలువలోని మురికిని తీయించి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఈ సీజన్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు.