ఓ వ్యక్తి బ్లింకిట్ లో ఈ ఏడాదంతా కలిసి 9,940 కండోమ్స్ ఆర్డర్ పెడితే మరో వ్యక్తి 38 అండర్ వేర్లను ఒకే నెలలో ఆర్డర్ చేసుకున్నాడు. ఇలాంటి మరికొన్ని ఆర్డర్ల గురించి బ్లింకిట్ తెలియజేసింది.
2023 ఏడాది మరో 24 గంటల్లో ముగుస్తుంది. ఈ తరుణంలో క్విక్ డెలివరీ ప్లాట్‌ఫామ్ అయిన బ్లింకిట్ కొన్సి సరదా విషయాలను వెల్లడించింది. నిమిషాల వ్యవధిలో వినియోగదారులకు తాము కోరుకున్నది అందించే ఈ సంస్థ తాము ఈ ఏడాదిలో సరఫరా చేసిన కొన్ని వస్తువుల వివరాలను బయటపెట్టింది. ఈ ఏడాదిలో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి 9,940 కండోమ్స్‌ను ఆర్డర్ చేసినట్లు తెలిపింది.
అలాగే ఈ ఏడాదిలో తమ యూజర్లకు 30,02,080 పార్టీ స్మార్ట్ టాబ్లెట్లను సరఫరా చేసినట్లు చెప్పుకొచ్చింది. రాత్రి మందు తాగిన తర్వాత పొద్దున్నే హ్యాంగోవర్ ఉండకుండా ఆ టాబ్లెట్లను వాడుతారు. ఇకపోతే గురుగ్రామ్ ప్రాంతంలో ఏడాది మొత్తంగా 65,973 లైటర్లను తమ యూజర్లకు అందించినట్లుగా బ్లింకిట్ వెల్లడించింది. ఈ ఏడాది పొడవునా అర్థరాత్రి దాటిన తర్వాత 3,20,04,725 మ్యాగీ ప్యాకెట్లను సరఫరా చేసినట్లు బ్లింకిట్ తెలిపింది.
ఇకపోతే హైదరాబాద్ నుంచి ఓ వ్యక్తి 2023లో చాలా సార్లు బియ్యాన్ని ఆర్డర్ చేశాడట. అలా ఆయన 17,009 కేజీల బియ్యాన్ని ఆర్డర్ చేసినట్లు బ్లింకిట్ చెప్పుకొచ్చింది. అదేవిధంగా ఓ వ్యక్తి ఒకే నెలలో 38 అండర్ వేర్లను బ్లింకిట్ ద్వారా తెప్పించుకుంటే మరో వ్యక్తి 972 మొబైల్ చార్జర్లను ఆర్డర్ చేసినట్లు బ్లింకిట్ తెలిపింది.