Jayapradha: సీనియర్ నటి జయప్రద గురించి తెలియని వారు ఉండరు. ఆమె నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. నటి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిపోయింది. ఆమె రాజకీయ జీవితం టీడీపీ పార్టీతో మొదలైంది. ఆ తర్వాత ఆమె సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున జయప్రద రాంపూర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసి విజయం సాధించారు. ఆమె ఇప్పుడు పార్టీలు మారి బీజేపీలో చేరారు.
ఉత్తరప్రదేశ్ పోలీసులు జయప్రద కోసం వెతుకుతున్నారు. 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన రెండు కేసుల్లో ఆమె ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే, విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించినప్పటికీ, జయప్రద హాజరుకాలేదు. ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఆమెను జనవరి 10న తమ ముందు హాజరుపరచాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.రాంపూర్ పోలీసులు ఆమె కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.