కృష్ణా: రాబోయే రోజుల్లో తుఫాన్ ప్రభావం ఉండొచ్చు అన్న నేపథ్యంలో గుడివాడ మండలంలో కోతకు వచ్చిన వరి ధాన్యాన్ని రోడ్లపై విస్తారంగా పరచి ఆరబోసుకుంటున్నామని రైతులు మంగళవారం తెలిపారు. తేమ తగ్గించి, మార్కెట్లో మంచి ధర లభించేందుకు రైతులు పెద్ద ఎత్తున శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు.