తమ యూజర్లకు జియో (Jio) శుభవార్త చెప్పింది. నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ (Netflix Subscription)తో రెండు ప్రీ-పెయిడ్ మొబైల్ ప్లాన్లను జియో తీసుకొచ్చింది. ప్రీ-పెయిడ్ ప్లాన్‌తో పాటుగా నెట్‌ఫ్లిక్స్ బండిల్స్‌ను కూడా ప్రారంభిస్తున్నట్లు జియో ప్లాట్‌ఫామ్స్ సీఈవో కిరణ్ థామస్ తెలిపారు. అయితే ఇప్పటికే జియో పోస్ట్-పెయిడ్ ప్లాన్, జియో ఫైబర్ ప్లాన్ల (Jio Fibre Plan) ఎంపికపై యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ వస్తోంది. కానీ ప్రీ-పెయిడ్ యూజర్లకు మాత్రం ఇది అందుబాటులో లేదు. తాజాగా ఆఫర్‌తో ప్రీపెయిడ్ యూజర్లకు కూడా నెట్‌ఫ్లిక్స్ అందనుంది. ఈ ప్లాన్లతో 40 కోట్లకు పైగా జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లభించనుంది.