బరువు (Weight) పెరిగే కొద్దీ మనుషుల్లో టెన్షన్ పెరగడం మొదలవుతుంది. చాలా మంది మేము ఏం చేసినా బరువు తగ్గడం (Weight Loss) లేదు అని బెంగపడుతూ ఉంటారు. కానీ నిజానికి ఎలా బరువు తగ్గాలో తెలిస్తే ఈ సమస్య ఉండదు. చాలా మంది బరువు తగ్గడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తారు. భోజనం (Lunch) మానేస్తారు. వ్యాయామాలు (Workouts) చేస్తారు. కొద్దిరోజులు చేసి వాటిని ఫాలో అవ్వలేక మళ్లీ ఆపేస్తారు. ఇవేమీ కాకుండా తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కూడా సులభంగా బరువు తగ్గవచ్చట. అదెలాగో ఓసారి చూద్దాం.. మీరు ఏడు రోజుల్లో అంటే ఒక వారంలో (Week) స్లిమ్ ట్రిమ్ బాడీని పొందాలనుకుంటే, ఈ క్రింది ఫుడ్ చార్ట్‌ని (Food Chart) అనుసరించండి. దీంతో బరువు తగ్గి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు.
ఉదయాన్నే ప్రారంభం: వారంలో ఏడు రోజులు నిద్ర (Sleep) లేచిన వెంటనే వేడి నీటిలో తేనె (Honey) కలిపి తాగాలి. తేనెతో నిమ్మరసం ఎప్పుడూ కలపకూడదు. వేడి నీటిలో (Hot Water) విటమిన్ సీ కలపడం హానికరం. కండరాలను బలహీనపరుస్తుంది.
అల్పాహారం ఇలా ఉండాలి: అల్పాహారం (Tiffin) తినకుండా ఉండొద్దు. తప్పనిసరిగా తినాలి. రోజూ ఉదయం ఆహారం తీసుకోవాలి. ఇది తేలికగా ఉండాలి. అల్పాహారం కోసం ఓట్స్ లేదా రెండు రోటీలు, ఒక గిన్నె పప్పు తీసుకోండి. గుడ్లు, పాలు కూడా తీసుకోవచ్చు. పప్పుల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల మీ కండరాలు బలపడతాయి.
అల్పాహారం – భోజనాల మధ్య ఏమి తినాలి?: అల్పాహారం తిన్న గంట తర్వాత పండ్లు (Fruits) తినవచ్చు. జ్యూస్ అయినా తాగొచ్చు. యాపిల్ లేదా అరటిపండు తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మధ్యాహ్న భోజనంలో (Lunch) ఏమి తినాలి? :
మధ్యాహ్నం 2 గంటలలోపు తినడం చాలా ముఖ్యం. మధ్యాహ్న భోజనంలో బ్రౌన్ రైస్, పప్పు, పచ్చి కూరగాయలు తీసుకోవాలి. బ్రౌన్ రైస్ ఫైబర్ మంచి మూలం. చాలా సేపు కడుపు నిండిన అనుభూతి. అలాగే జీర్ణక్రియను (Digestion) సులభతరం చేస్తుంది.
బరువు తగ్గాలంటే మహిళలు ఏం చేయాలి?
భోజనం చేసిన రెండు గంటల తర్వాత మొలకెత్తిన ధాన్యం (Sprouted Seeds) తినాలి. నిమ్మరసంలో (Lemon Water) కూడా కలిపి తినవచ్చు. మొలకెత్తిన బీన్స్ బరువు తగ్గడంలో సహాయపడతాయి. అలాగే కండరాలను బలపరుస్తుంది.
రాత్రి భోజనం ఇలా ఉండాలి
త్వరగా బరువు తగ్గాలనుకునే వారు రాత్రిపూట తక్కువ ఆహారం తీసుకోవాలి. 2 రొట్టెలు, ఉడకబెట్టిన పప్పు (Dal), పచ్చి కూరగాయలు తినండి. మాంసం (Meat), గుడ్లు (Eggs) కూడా తినవచ్చు. తిన్న వెంటనే నిద్రపోకూడదు. భోజనం చేసిన రెండు గంటల తర్వాత నిద్రపోవాలి. భోజనం అనంతరం ఒక గంట తర్వాత పసుపు పాలు తాగితే మంచిది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా శరీర బరువు కూడా తగ్గుతారు.