పనిపై శ్రద్ధ పెట్టలేం.. చిరాకు.. అసహనం వస్తుంది. తలనొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతుంటాం. అయితే తలనొప్పి రాగానే మనమందరం మందులు వేసుకుంటూ ఉంటాం. అయితే, ట్యాబ్లెట్ అవసరం లేకుండా కూడా తలనొప్పిని తగ్గించవచ్చట.
చాలా మంది తలనొప్పితో (Headache) బాధపడుతున్నారు. కాస్త పని ఒత్తిడి (Work Load) ఎక్కువైనా.. సరైన ఆహారం తీసుకోకపోయినా ఇలా కారణం ఏదైనా తలనొప్పి సమస్య ఎదురవుతుంది. దీని వలన చేస్తున్న పనిపై శ్రద్ధ పెట్టలేం.. చిరాకు.. అసహనం వస్తుంది. తలనొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతుంటాం. అయితే తలనొప్పి రాగానే మనమందరం మందులు (Tablets) వేసుకుంటూ ఉంటాం. అయితే, ట్యాబ్లెట్ అవసరం లేకుండా కూడా తలనొప్పిని తగ్గించవచ్చట. అది కూడా కేవలం ద్రాక్ష జ్యూస్ (Grapes Juice) తాగడం వల్ల సులభంగా తలనొప్పి సమస్య నుంచి బయటపడొచ్చట. అదెలాగో ఓసారి చూద్దాం..
తరచూ తలనొప్పితో బాధపడుతున్నవారు ఒక గ్లాస్ (Glass) ద్రాక్ష రసం తాగితే వెంటనే తలనొప్పి నుంచి బయటపడవచ్చట. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ద్రాక్ష పండు రసం తల నొప్పి నుంచి మంచి ఉపశమనం (Relief) కలిగిస్తుంది. ద్రాక్షలో ఉండే రైబోఫ్లేవిన్, విటమిన్ బీ 12 (Vitamin B12), సీ, కే, మెగ్నిషీయంలు తలనొప్పిని తగ్గిస్తాయి. అలాగే మైగ్రేన్ (Migraine) వంటి దీర్ఘకాలిక తలనొప్పి సమస్యకు కూడా ద్రాక్ష రసం మెరుగ్గా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ద్రాక్ష రసాన్ని రోజూ తాగితే మైగ్రేన్ నుంచి కూడా బయట పడవచ్చని వైద్యులు (Doctors) సూచిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓసారి ప్రయత్నించి చూడండి.