»Indian Pharmacopoeia Commission Orders Issued In The Case Of Meftal Pain Killer
Meftal pain killer: విషయంలో కేంద్రం ఆదేశాలు జారీ
ఇండియన్ ఫార్మాకోపోయియా కమిషన్ (IPC) మెఫ్టల్ పెయిన్‌కిల్లర్ గురించి డ్రగ్ సేఫ్టీ హెచ్చరికను జారీ చేసింది. దానిలోని మెఫెనామిక్ యాసిడ్, ఇసినోఫిలియా, దైహిక లక్షణాల (DRESS)సిండ్రోమ్ వంటి ప్రతికూల చర్యలకు కారణమవుతుందని పేర్కొంది.
Indian Pharmacopoeia Commission orders issued in the case of Meftal pain killer
కొన్నిసార్లు పీరియడ్స్ నొప్పి భరించలేనంతగా తయారవుతుంది. దానిని తగ్గించడానికి మహిళలు పెయిన్ కిల్లర్ల(Meftal pain killer)ను ఆశ్రయిస్తారు. అటువంటి పరిస్థితిలో, కొన్ని నొప్పి నివారణ మందులు తీసుకోవడం హాని కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పీరియడ్స్ సహా పలు రకాల నొప్పుల కొసం తీసుకునే మెఫెనామిక్ యాసిడ్ అంటే మెఫ్టాల్ మందు విషయంలో ఇండియన్ ఫార్మాకోపోయియా కమిషన్ డ్రగ్ సెఫ్టీ(Indian Pharmacopoeia Commission) హెచ్చరికలు జారీ చేసింది.
వాస్తవానికి ఔషధ ప్రతిచర్యలను నియంత్రించే ప్రభుత్వ సంస్థ అయిన ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా (PvPI) మెఫెనామిక్ యాసిడ్ గురించి పెద్ద ప్రకటన ఇచ్చింది. ఈ మెడిసిన్ వాడిన తర్వాత డ్రస్ సిండ్రోమ్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని ఆ సంస్థ చెబుతోంది. వీటి వాడకం ద్వారా ఇసినోఫిలియా, సిస్టెమిక్ సింప్టమ్ సిండ్రోమ్ వంటి చర్యలు వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించారు. అంతేకాదు దీనిని వాడుతున్న వారికి ఏదైనా దుష్పప్రభావాలు ఏర్పడితే పీవీపీఐకి తెలిపాలని సూచించారు. లేదా 18001803024కు ఫోన్ చేయాలని వెల్లడించారు.
PPVI ప్రకారం దీనిని ప్రధానంగా కండరాలు, కీళ్లలో నొప్పి లేదా తలనొప్పి(headache) వంటి అనేక సమస్యలకు ఈ ఔషధాన్ని ఉపయోగిస్తున్నారు. చాలా సార్లు ఈ ఔషధం పిల్లలలో జ్వరంలో కూడా ఉపయోగించబడుతుందని తేలింది. వాస్తవానికి డ్రెస్ సిండ్రోమ్ అనేది తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య. దీనిలో చర్మంపై దద్దుర్లు మొదలైనవి ఏర్పడతాయి. ఈ ప్రతిచర్య కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ఔషధం తీసుకున్న తర్వాత మరణ ప్రమాదం 10 శాతం పెరుగుతుందని అంటున్నారు. DRESS సిండ్రోమ్ విషయంలో, కాలేయం, శోషరస గ్రంథులు ప్రభావితమవుతాయి. PPVI ప్రకారం డాక్టర్ సలహా లేకుండా ఈ ఔషధాన్ని తీసుకోవడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.
పీరియడ్స్ పెయిన్ తగ్గాలంటే ఏం చేయాలి?
పీరియడ్స్ పెయిన్ తగ్గించుకోవడానికి కొంతమంది మహిళలు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం ప్రారంభిస్తారు
నొప్పిని తగ్గించుకునేందుకు ప్యాడ్స్ ఉపయోగించవచ్చు
అటువంటి పరిస్థితిలో, వేడి నీటితో స్నానం చేయండి.
ఈ పరిస్థితిలో మీరు ధ్యానం, ప్రాణాయామం కూడా చేయవచ్చు
ఇలాంటి పరిస్థితుల్లో మద్యపానం, పొగతాగే అలవాటును తగ్గించుకోవాలి.
దీని నుంచి ఉపశమనం పొందేందుకు ఆక్యుపంక్చర్ కూడా ప్రయత్నించవచ్చు