»Chicken Do You Eat A Lot Of Chicken In Summer But Be Careful
Chicken: సమ్మర్లో ఎక్కువగా చికెన్ తింటున్నారా.. అయితే జాగ్రత్త!
మనలో చాలామంది చికెన్ లవర్స్ ఉన్నారు. రోజులతో పనిలేకుండా వీళ్లు చికెన్ తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే వేసవిలో చికెన్ తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. దీంతో పలు సమస్యలు కూడా వస్తాయి.
Chicken: Do you eat a lot of chicken in summer.. But be careful!
Chicken: మనలో చాలామంది చికెన్ లవర్స్ ఉన్నారు. రోజులతో పనిలేకుండా వీళ్లు చికెన్ తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే వేసవిలో చికెన్ తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. దీంతో బాడీ బాగా హీట్ అవుతుంది. బాడీ ఇలా హీట్ అయితే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలి. చికెన్‌లో శరీరానికి కావలసిన పోషకాలు అన్ని ఉన్నాయి. కండరాల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ మితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ హీట్ పెరిగి తీవ్రమైన తలనొప్పి, కళ్లు మంటలు, రక్తపోటు అదుపు తప్పడం, కండరాల నొప్పులు, విపరీతంగా చెమటలు పట్టడం, డీహైడ్రేషన్ వంటి సమస్యలన్నీ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే వేడికి అజీర్తి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు సమ్మర్లో చికెన్‌ను తగ్గించడం మంచిది. వీలైతే పండ్లు, కొబ్బరి నీరు వంటివి తీసుకోవడం బెటర్.