Treatment For Headache: ప్రపంచంలో అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా ప్రమాదకరమైనవి… కొన్ని సాధారణమైనవి. వీటిలో జలుబు, తలనొప్పి వంటి సమస్యలు ఉంటాయి. సహజంగా మీకు తలనొప్పి వచ్చినప్పుడు మీరు ఏమి చేస్తారు? తలనొప్పికి మందు తీసుకుంటారు. దీని కారణంగా మీకొచ్చిన నొప్పి కొద్దిసేపట్లో మాయమవుతుంది. అయితే మందులు లేనప్పుడు తలనొప్పికి ఎలా చికిత్స చేశారో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఇది 128 సంవత్సరాల నాటిదని చెబుతున్నారు. గతంలో తలనొప్పికి ఎలా చికిత్స చేశారో కూడా ఆ ఫోటోలో పేర్కొన్నారు.
ఈ ఫోటోకు సంబంధించి ఇంటర్నెట్లో వ్యాపించిన పుకారు ప్రకారం, 1895లో తలనొప్పితో బాధపడుతున్న వ్యక్తులు తమ స్థానిక వైద్యుడి వద్దకు (కమ్మరి) వెళ్లినప్పుడు, అతను బాధితుడి తలను లోహపు పాత్రలో ఉంచి, ఆపై అతను ఆ పాత్రను సుత్తితో కొట్టేవాడు. ఈ విధంగా అతను ప్రజల తలనొప్పులకు చికిత్స చేసేవాడు. ఇంటర్నెట్ పబ్లిక్ ఈ చికిత్స పద్ధతికి ‘వైబ్రేషన్ థెరపీ’ అని పేరు పెట్టారు. అయితే, ఈ చిత్రాన్ని చూస్తే తలనొప్పికి ఇంతకు ముందు ఈ విధంగా చికిత్స చేశారా లేదా ఇది మరేదైనా చారిత్రక వైద్య చికిత్సా పద్ధతితో అర్థం కావట్లేదు.
ఈ చిత్రం మొదటిసారిగా సోషల్ మీడియాలో వైరల్ కానప్పటికీ, ఇది చాలా సంవత్సరాలుగా విభిన్న శీర్షికలతో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. Snopes అనే వెబ్సైట్ నివేదిక ప్రకారం, డ్రగ్ అడిక్షన్కి సంబంధించిన చికిత్స ఈ చిత్రంలో చూపబడింది అని కొన్ని పోస్ట్‌లు పేర్కొంటున్నాయి. అయితే కొందరు దీనిని తలనొప్పికి చికిత్సగా భావిస్తారు. అయితే ఈ చిత్రం వాస్తవికత ఏమిటో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్లో @cctvidiots అనే IDతో షేర్ చేశారు. దానిపై ప్రజలు వివిధ రకాలైన కామెంట్స్ చేస్తున్నారు.