VZM: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగ నియామకంలో అర్హత సాధించిన అభ్యర్థులకు శిక్షణ షెడ్యూల్ ప్రకటించాలని అభ్యర్థులు శనివారం బొబ్బిలిలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఫలితాలు వెలువడి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ శిక్షణ షెడ్యూల్ విడుదల చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి శిక్షణా షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు.