కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించడం మొదలుపెడుతోంది. ఇప్పటికే చైనాలో కొత్త రకం వేరియంట్ కలకలం రేపడం మొదలుపెట్టింది. భారత్ లోనూ… ఈ వేరియంట్ ప్రవేశించింది. ఈ క్రమంలో… ఇప్పటికే కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మానిటరింగ్ చేయాలని ఆదేశించింది.
కాగా, నేడు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్రావు అధికారులతో సమీక్షను నిర్వహించనున్నారు. తెలంగాణలో కోవిడ్ కేసుల ప్రభావం ఏ విధంగా ఉన్నది. తీసుకుంటున్న చర్యలు, చేపట్టవలసిన చర్యలు, జాగ్రత్తలు తదితర అంశాలపై వైద్యారోగ్యశాఖాధికారులతో చర్చించనున్నారు. అయితే, ఈ వేరియంట్ ప్రభావం తెలంగాణపై పెద్దగా లేదని అధికారులు చెబుతున్నారు.
అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో జీరో కోవిడ్ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు వైద్యశాఖాధికారులు సిద్దమయ్యారు.