AP: హైకోర్టు సీజేల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణకు 2 నెలలముందే కొత్త సీజేలను నియమించాలని నిర్ణయించింది. మద్రాస్, ఏపీ హైకోర్టులకు కొత్త సీజేలను కొలీజియం సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్, మద్రాస్ హైకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ సుశ్రుత్ అరవింద్‌ను సిఫారసు చేశారు.