AP: రాష్ట్రంలో డిసెంబర్ 6 నుంచి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఉండనున్నట్లు వెల్లడించింది. గ్రామస్థాయిలో భూవివాదాల పరిష్కారానికి ఈ సదస్సులు ఉపయోగపడనున్నాయి.