జియో తమ ఇంట్రా సర్కిల్ రోమింగ్(ICR) సేవలను బలోపేతం చేసుకోవడానికి BSNLతో చేతులు కలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో కవరేజీని మెరుగుపరచడం ఈ భాగస్వామ్యం ముఖ్య లక్ష్యం. JIO-BSNL ICR సేవలు ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా మారుమూల ప్రాంతాల్లో కూడా జియో యూజర్లు మెరుగైన కాలింగ్, డేటా సేవలను పొందగలుగుతారు.