KRNL: హలహార్వి మండలం గుళ్యం గ్రామంలో ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించే గాదిలింగప్ప తాత పూల తేరు ఉత్సవం కోసం TDP ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి రూ.10,000 విరాళాన్ని గురువారం అందించారు. గ్రామ ప్రజల ఆచార–సంస్కృతులను కాపాడే ఇటువంటి ఉత్సవాలు సామాజిక సమైక్యతకు దారితీస్తాయని పేర్కొన్నారు. ఉత్సవం విజయవంతంగా జరిగేలా అవసరమైన సహాయాన్ని అందిస్తామన్నారు.