TG: దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ నాంపల్లిలో సిబ్బంది లేకుండా ఆటోమేటెడ్ పార్కింగ్ సిస్టమ్ ప్రారంభమైంది. సుమారు రూ.200 కోట్లతో నిర్మించిన ఈ రోబోటిక్ పార్కింగ్ వ్యవస్థలో 250 కార్లు, 200 బైక్లను సులభంగా పార్క్ చేయవచ్చు. దీనివల్ల వాహనదారులకు సమయం ఆదా కావడంతోపాటు నగరంలోని పార్కింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రోబోల సాయంతో వాహనాలను పార్క్ చేయొచ్చు.