TG: తమ హయాంలో భర్తీ చేసిన 67 వేల ప్రభుత్వ ఉద్యోగాల్లో 87 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే దక్కాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎస్సీ నాయకులు స్పీకర్లుగా, ఆర్థిక మంత్రులుగా ఉండకూడదా అని ఆయన ప్రశ్నించారు. గత పదేళ్లలో లేని విధంగా కీలక పదవుల్లో బహుజనులకు ప్రాతినిధ్యం కల్పించామని, గతంలో భట్టి సీఎల్పీ హోదాను తొలగించేలా కుట్రలు జరిగాయని గుర్తుచేశారు.