AP: విజయవాడ గుణదలలో భారీగా హవాలా నగదు పట్టుబడింది. ఒడిశా నుంచి విజయవాడ తరలిస్తున్న రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుజరాత్‌కు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, కారును సీజ్ చేశారు. నిందితులను ఐటీ అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.