AP: జగన్ సీఎంగా ఉండగానే రాయలసీమ ప్రాజెక్టును NGT ఆపిందని మంత్రి నిమ్మల రామానాయుడు గుర్తుచేశారు. ‘అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు. రాయలసీమకు నిజమైన ద్రోహి జగన్. ఆయన్ను నిలదీయకుండా తప్పుడు ఆరోపణలు చేయడం దారుణం. YCP హయాంలోనే సీమలోని ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఆ ప్రాంతానికి నీరిచ్చేందుకు ఒక్క ప్రాజెక్టునూ చేపట్టలేదు’ అని అన్నారు.