TG: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ఆసక్తి పెంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెస్సీని రాష్ట్రానికి పిలిస్తే ప్రతిపక్షాలు విమర్శించాయన్నారు. క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. యువత మత్తు వదిలి.. మైదానం బాట పట్టండి అని సూచించారు. ఫాంహౌస్ పార్టీలకు దూరంగా ఉండాలన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు నిఖత్ జరీన్, సిరాజ్‌లకు ఉద్యోగాలిచ్చామన్నారు.