AP: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ప్రకటన చేశారు. అవసరం అయితే టీటీడీ ఉద్యోగులపై చర్యలకు వెనుకాడబోనని వెల్లడించారు. కొందరు ఉద్యోగులు భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అలాంటి వారిపై చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి ఆలోచన ఉండదని హెచ్చరించారు. ఈ క్రమంలో ఉద్యోగులందరికీ నేమ్ బ్యాడ్జ్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.