TG: ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ సమ్మిట్లో CM రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రపంచంలోని టెక్నాలజీ దిగ్గజాలన్నీ ఈ సదస్సుకు వచ్చాయి. ఆలోచనలే మన జీవితాన్ని మార్చేస్తాయి. వ్యాక్సిన్లు, విమానాల వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయి. మనిషికి ఎన్నో పరిమితులు ఉండొచ్చు. ఇప్పుడు మనిషి అత్యున్నత ఆవిష్కరణ అయిన AI ఫలితాలు మనం చూస్తున్నాం’ అని అన్నారు.