AP: గుంటూరు జిల్లా కలెక్టరేట్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన ఇంటిని అక్రమంగా ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేస్తూ దాసరి పాపయ్య అనే వృద్ధుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు అప్రమత్తమై పాపయ్య చేతిలోని పెట్రోల్ సీసాను లాక్కోవడంతో పెను ప్రమాదం తప్పింది.