AP: DSC, జాబ్ క్యాలెండర్ హామీలతో అప్పటి YCP ప్రభుత్వం యువతను నమ్మించి మోసం చేసిందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. టీచర్లను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టి, యువతను కల్తీ మద్యంలో ముంచేసింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడేమో టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలంటూ నాటకాలాడుతున్నారని అన్నారు. DSCలో అక్రమాలకు సంబంధించి YCP దగ్గర ఆధారాలుంటే చూపాలని డిమాండ్ చేశారు.