TG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కోరారు. ఎకరాకు రూ.15 వేలు, యాదవులకు రూ. 2 లక్షలు, ముదిరాజ్ సోదరులకు చేప పిల్లలను ఇస్తానని చెప్పిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయకుండా కావాలనే జాప్యం చేస్తుందని మండిపడ్డారు.