TG: MMTSలో ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం MMTS ద్వారా వస్తున్న రూ.10 కోట్ల వార్షిక ఆదాయాన్ని తామే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు త్వరలో MoU కుదుర్చుకోనున్నారు. అయితే MMTS రెండో దశకు సంబంధించి పెండింగ్లో ఉన్న రూ.491.45 కోట్ల బకాయిలను చెల్లించాలని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.