AP: విశాఖ, అమరావతి, తిరుపతి పేరిట ఎకనమిక్ రీజియన్లను నిర్మిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. కడప జిల్లాలోని సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. తిరుపతికి రాయల్ ఎన్ఫీల్డ్, ఫైటర్ జెట్ కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. రాయలసీమను రత్నాల సీమగా మార్చడమే తమ అజెండా అని పేర్కొన్నారు. 20 లక్షల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.