Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. కాగా... ఈ పర్యటనలో ఆయన మళ్లీ మార్పులు చేశారు. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా ఈ నెల 11న హైదరాబాద్ కు రావాల్సి వుంది. ఆ మరుసటి రోజు సంగారెడ్డిలో నిర్వహించే బీజేపీ మేధావుల సమావేశానికి ఆయన హాజరు కావాల్సి వుంది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. కాగా… ఈ పర్యటనలో ఆయన మళ్లీ మార్పులు చేశారు. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా ఈ నెల 11న హైదరాబాద్ కు రావాల్సి వుంది. ఆ మరుసటి రోజు సంగారెడ్డిలో నిర్వహించే బీజేపీ మేధావుల సమావేశానికి ఆయన హాజరు కావాల్సి వుంది.
కానీ మేధావుల సమావేశాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. ఈనెల12న అమిత్ షా కేరళ పర్యటనకు వెళ్లనున్నట్టు బీజేపీ శ్రేణులు వెల్లడించాయి. ఈ నెల 11న రాష్ట్ర బీజేపీ నేతలను ఆయన కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అమిత్ షా తెలంగాణ పర్యటనకు సంబధించి త్వరలోనే కొత్త షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు బీజేపీ అధిష్ఠానం పేర్కొంది.
పార్లమెంట్ ప్రవాస్ యోజనలో అమిత్ షా పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఏ పార్లమెంటు నియోజకవర్గంలో ఆయన పాల్గొంటారనే విషయంలో మాత్రం పార్టీ వర్గాలు క్లారిటీ ఇవ్వడం లేదు. తాజాగా ఇప్పుడు పర్యటనలో మార్పులు కూడా చేశారు. అంతకు ముందు ఆదిలాబాద్ పర్యటన సమయంలోనూ ఇలానే జరిగింది. చివరి క్షణంలో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.