AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్‌రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్‌ను నియమించినట్లు తెలిపారు. డెడికేటెడ్ కమిషన్ నియామకం పట్ల సీఎం చంద్రబాబుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.