TG: వడదెబ్బ బాధితులకు తక్షణ చికిత్స అందించేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. దవాఖానల్లో తాగునీరు, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేసి రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమర్జెన్సీ వార్డుల్లో ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉంచి, అవసరమైన మందులు, ORS అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.