AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.