TG: రాష్ట్రంలో ఆదివారం ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్ ఫలితాలు పలు కుటుంబాల్లో తీరని ఆవేదన మిగిల్చాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో రాష్ట్రవ్యాప్తంగా వేరేవేరు చోట్ల ఆరుగురు విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకున్నారు. మెదక్, సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబ్నగర్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఈ దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి.