AP: కడప జిల్లా టి.కోడూరు వద్ద మంత్రి లోకేష్ సోలార్ ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విద్యుత్ ఛార్జీలు తగ్గించే దిశగా గొట్టిపాటి కృషి చేస్తున్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం అహర్నిశలు సవిత కృషి చేస్తున్నారు. ప్రాజెక్టును 11 నెలల్లో సాధించడం వెనుక రైతుల త్యాగం ఉంది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తోంది’ అని పేర్కొన్నారు.