AP: చంద్రబాబు 6 ఏళ్లుగా అమరావతికి ఎందుకు చట్టబద్ధత కల్పించలేదని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. 6 ఏళ్లలో ఒక్క శాశ్వత బిల్డింగ్ కూడా చంద్రబాబు కట్టలేకపోయారని మండిపడ్డారు. కానీ ఆ నింద జగన్పై మోపుతున్నారని దుయ్యబట్టారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు మానసిక వేధింపులే మిగిలాయన్నారు. నవ నగరాలు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పే దమ్ము.. CBNకు ఉందా? అని సవాల్ విసిరారు.