AP: తిరుమల పవిత్రత రోజురోజుకీ దెబ్బతింటోందని, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని తక్షణమే తొలగించాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ ముఖ్య కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బీఆర్ నాయుడిని తొలగించాలంటూ రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.