AP: కూటమి ప్రభుత్వంపై మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే నేరాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం బుగ్గన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త సంస్కృతులను తెచ్చారని విమర్శించారు. జోగి రమేష్ ఇంటిపై దాడి వీడియో చూస్తే అర్థమవుతుందని అన్నారు.