TG: BRS త్రిసభ్య బృందం ఢిల్లీకి చేరుకుంది. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎంపీ రవిచంద్ర ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలోని సీనియర్ న్యాయవాదులతో ఈ సాయంత్రం భేటీ కానున్నారు. పార్టీ ఫిరాయింపులు, కాళేశ్వరం కేసుల నేపథ్యంలో న్యాయవాదులతో.. న్యాయపరమైన చర్యలపై చర్చించనున్నారు.