TG: లిక్కర్ స్కాంపై కోర్టు తీర్పుపై ఎక్స్‌లో కేటీఆర్ పెట్టిన పోస్టుపై కవిత స్పందించారు. ‘నా అన్న KTR.. నాపై పెట్టిన కేసు వల్లే BRS ఓడిందన్నట్లుగా పోస్టు చేశారు. ప్రజలకు ఇళ్లు, ఉద్యోగాలు ఇవ్వకపోవడం, అభ్యర్థులను మార్చకుండా మళ్లీ వాళ్లకే టికెట్లు ఇవ్వడం, అన్నింటికంటే ముఖ్యంగా మీ అహంకార ధోరణి వల్లే పార్టీ ఓడింది. నేను కడిగిన ముత్యంలా బయటకు వచ్చాను’ అని అన్నారు.