TG: HYDలో బస్తీ దవాఖానాలో వైద్యునిగా పనిచేస్తున్న పురోహిత్ కిషోర్(34) అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కిషోర్ MBBS డాక్టర్‌గా అల్వాల్ బస్తీ ఆస్పత్రిలో పనిచేసేవాడు. అతనికి కొన్ని రోజుల కిందట నిశ్చితార్థం జరిగింది. అయితే తనకు బట్టతల ఉండటం, ఇతర కారణాల వల్ల నిశ్చితార్థం రద్దయింది. మళ్లీ సంబంధాలు కుదరకపోవడంతో వేదనకు గురైన కిషోర్.. ఆత్మహత్య చేసుకున్నారు.