KMM: జూలూరుపాడులో శాశ్వత ఉప మార్కెట్ యార్డును నిర్మించాలని కోరుతూ గిరిజన కార్మిక రైతు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు గండుగులపల్లి గ్రామంలో ఆదివారం వినతిపత్రం అందజేశారు. జూలూరుపాడు మండలంలో అధికంగా పత్తి పంటను రైతులు పండిస్తారని తెలిపారు. పత్తిని అమ్ముకునేందుకు శాశ్వత ఉప మార్కెట్ యార్డును నిర్మించాలని మంత్రిని కోరారు.