MHBD: సీరోల్ మండల కేంద్రానికి చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఆదివారం చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గనిని వెంకన్న చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంగాపురం సైదులు అనే లబ్ధిదారుడికి 40 వేల ఎల్వోసీ చెక్కును అందజేసినట్లు వెంకన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.