MBNR: పేదరికంతో బాధపడుతున్న విద్యార్థికి ల్యాప్టాప్ అందించి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి గొప్ప మనసును చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే కౌకుంట్ల మండలం ముచింతల గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి అనే విద్యార్థి బీటెక్ మూడవ సంవత్సరం చదువుకున్నాడు. ప్రస్తుతం ల్యాప్ టాప్ కొనలేని పరిస్థితిలో ఎమ్మెల్యేను సంప్రదించగా ఆదివారం ఆయన వెంటనే ల్యాప్ టాప్ ఇచ్చారు.